స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. గత కొన్నాళ్లుగా హెల్త్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. తాజాగా కొత్త సినిమాను ప్రకటించింది. ఈ సినిమాకు నిర్మాత కూడా తనే కావడం విశేషం.
Samantha: స్టార్ బ్యూటీ సమంత గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సామ్. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్లో చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ మాత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. ఇది తప్పితే మరో కొత్త ప్రాజెక్ట్ సైన్ చేయలేదు అమ్మడు. అయితే.. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో, పాడ్ కాస్ట్లతో అభిమానులతో టచ్లో ఉంటూనే ఉంది సామ్. ఇక.. ఇప్పటి వరకు హీరోయిన్గా సినిమాలు చేసిన సమంత.. నిర్మాతగా కూడా రాణించాలని అనుకుంటోంది.
గతంలోనే తాను నిర్మాతగా మారుతున్నట్టు ప్రకటించింది. ‘త్రాలల మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించించింది. లేటెస్ట్గా ఏప్రిల్ 28న సమంత పుట్టిన రోజు సందర్భంగా.. తన నిర్మాణ సంస్థ నుంచి ఫస్ట్ సినిమాని ప్రకటిస్తూ టైటిల్ అనౌన్స్ చేసింది సామ్. ఈ సినిమాలో సమంతనే హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో సమంత లుక్ అదిరిపోయింది.
చీరకట్టుకొని, మెడలో తాళిబొట్టుతో, చేతిలో తుపాకీ పట్టుకొని చాలా సీరియస్గా ఉంది సమంత. దీంతో.. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. బంగారు మయం కావాలంటే అన్నీ మెరవాల్సిన అవసరం లేదు.. అని రాసుకొచ్చింది సామ్. ఏదేమైనా.. సమంత ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు.