వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు సాలిడ్ హిట్ ఇచ్చింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. దీంతో సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్టేట్ వైరల్‌గా మారింది.
Salaar 2: 'Salar 2' solid update.. shooting update is here!
Salaar 2: సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్గా వాడుకున్నాడు నీల్. ఇక ఖాన్సార్‌లో జరిగిన ఊచకోతను పార్ట్ 1 సెకండాఫ్‌లో శాంపిల్‌గా చూపించిన నీల్, పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో అసలు కథ చెప్పబోతున్నాడు. దీంతో.. సలార్ పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ కూడా సలార్ 2ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. కానీ మధ్యలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.
సలార్ 2 మూవీని వాయిదా వేసి.. ముందుగా ఎన్టీఆర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా టాక్ నడిచింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ బర్త్ డే రోజున మైత్రీ మూవీ మేకర్స్ ఆగష్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ప్రకటించారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సలార్ 2నే ముందు సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. వాస్తవానికైతే.. సమ్మర్లోనే సలార్ షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ కాస్త డిలే అయింది. ఫైనల్‌గా శౌర్యాంగ పర్వ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
సలార్ 2 షూటింగ్ ఆగష్టు 10 నుంచి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుందని.. దీనికోసం భారీ సెట్ వేస్తున్నట్లుగా సమాచారం. పదిహేను రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇప్పటికే పార్ట్ 1తో పాటు కొంత వరకు షూటింగ్ చేసి పెట్టుకున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే.. వీలైనంత త్వరగా సలార్ 2 షూటింగ్ కంప్లీట్ కానుందని చెప్పాలి. ఏదేమైనా.. కల్కి హిట్ జోష్‌లో సలార్ 2 అప్టేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.