Aparichitudu: అపరిచితుడు రీమేక్.. క్లారిటీ ఇచ్చిన శంకర్
స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమా భారతీయుడు 2. వచ్చే వారంలోనే విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ నేపథ్యంలో శంకర్ ఓ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
Aparichitudu: ఒకేసారి రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను హ్యాండిల్ చేస్తూ వస్తున్నాడు శంకర్. గేమ్ చేంజర్, ఇండియన్ 2 సినిమాల షూటింగ్ ఒకేసారి చేశాడు. ఎట్టకేలకు ఇప్పుడు భారతీయుడు 2 రిలీజ్‌కు రెడీ అయింది. 1996లో సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ సినిమా అవడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 12న భారతీయుడు 2 రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు.. కోలీవుడ్‌లో శంకర్ గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. పైగా కల్కి సినిమాలో సుప్రీం యస్కిన్‌గా అదరగొట్టేశాడు కమల్ హాసన్. కాబట్టి.. ఇప్పుడు ఇండియన్ 2 కోసం ఎదురు చూస్తున్నారు తమిళ తంబీలు. కానీ ఈ సినిమాకు తమిళ్లో తప్పితే మిగతా భాషల్లో మాత్రం కల్కి నుంచి గట్టి పోటీ తప్పేలా లేదంటున్నారు. అయినా కూడా ఇండియన్ 2తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు శంకర్.
ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా.. అపరిచితుడు రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చాడు శంకర్. గేమ్ ఛేంజర్ తర్వాత శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్ కమిట్ అయి ఉన్నాడు. ఈ సినిమా కోసం టెస్ట్ షూట్ కూడా చేశాడు. గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ తాజాగా శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం.. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలు మారిపోయాయి. నిర్మాతలు భారీ బడ్జెట్‌తో అన్నియన్ కంటే గొప్పగా కోరారు. రణ్వీర్తో సినిమా ఉంటుంది కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో సినిమా తీస్తా.. అని చెప్పుకొచ్చాడు. మరి ఈ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.