బాక్స్ ఆఫీస్ మొన్నటి వరకు వెలవెల పోయింది. ఇప్పుడిప్పుడే కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్ రాబోయే సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి అని టాక్ నడుస్తుంది.
Rajinikanth: వేసవి మొత్తం థియేటర్లు బోసిపోయాయి పెద్ద సినిమాలు లేక. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలా సినిమాల హడావిడీ కొనసాగుతుంది. జూన్ నెలలో కల్కి లాంటి పాన్ ఇండియా మూవీతో బాక్స్ ఆఫీస్‌కు మంచి రోజులు రాబోతున్నాయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సమ్మర్లో పెద్దగా సినిమాలు విడుదల కాకపోవడంతో పెద్ద సినిమాలు అన్ని ఒకే సారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడాహీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల తేదీలను ఖారారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు.
పాన్ ఇండియా సినిమాలు రాకముందే తమిళ తలైవా సూపర్‌స్టార్ దేశవ్యాప్తంగా తన సత్తా చాటాడు. ఆయన తమిళ్లో ఉన్నంత మార్కెట్ తెలుగులోనూ ఉందంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఆయన నుంచి వచ్చిన జైలర్ చిత్రం తెలుగులో ఎన్ని వసుళ్లు రాబట్టిందో చూశాము. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల ఆకలి తీర్చడానికి దేవర సరైన సినిమా అని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర సినిమాకు రజనీకాంత్ చిత్రం పోటీ కానుంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవర. స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా ఆక్టోబర్ 10న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పిటికే ప్రకటించారు. రజనీకాంత్, జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ కాంబినేషన్లో వెట్టైయాన్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా, అమితాబ్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. బలమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సైతం ఆక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో రెండు వైపుల నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కావడం విశేషం. ఏది ఏమైనా రెండు సినిమాలు బాగుంటే కలెక్షన్లకు డోకా ఉండదని.. గతంలో చాలా సినిమాలు నిరుపించాయి. చూడాలి మరీ రిలీజ్ డేట్స్ విషయంలో అడ్జెస్ట్ మెంట్ ఉంటుందో.. లేదా థియేటర్లో పోటాపోటీ ఉంటుందో.