»Krithi Shetty Reveals Her Fan Girl Admiration For Ram Charan
Krithi Shetty : తాను రిలేషన్షిప్లో ఉన్నానన్న కృతి శెట్టి
హీరోయిన్ కృతి శెట్టి తాజా చిత్రం ‘మనమే’ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. వీటిలో భాగంగా ఓ ఇంటర్య్వలో ఆమె మాట్లాడుతూ తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. మరి ఇంతకీ ఆమె ఈ విషయమై ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
Krithi Shetty : శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మనమే’(maname). జూన్ ఏడున విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కృతి శెట్టి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. వీటిలో భాగంగా ఆమె ఆ ఆసక్తికరమైన ప్రశ్నకు అద్దిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘మీరు రిలేషన్ షిప్లో ఉన్నారా? లేదా సింగిలా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు.
తాను సింగిల్ కాదు.. రిలేషన్లో ఉన్నానంటూ కృతి శెట్టి(Krithi Shetty) చెప్పుకచ్చారు. ఎవరితో రిలేషన్లో ఉన్నారని మళ్లీ ప్రశ్నించగా ‘నా పనితో, నా పనితో రిలేషన్లో ఉన్నా’ అంటూ అందంగా నవ్వేశారు. దీంతో అక్కడున్న వారి ముఖాల్లోనూ నవ్వుల పూలు విరబూశాయి. ఆ తర్వాత ‘మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి?’ అని ఆమెను అడగ్గా అందుకు ఆమె ఇలా క్వాలిటీస్‌ను చెప్పుకొచ్చారు. నిజాయతీపరుడై ఉండాలి. ఎదుటి వారిపై దయ కలిగిన వాడే ఉండాలి. అంటూ తెలిపారు.
తన ఇష్టా ఇష్టాలపైన కూడా కృతి(Krithi) కొన్ని వివరాలను పంచుకున్నారు. తనకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని చెప్పారు. అలాగే డ్యాన్స్ చేయడం కూడా తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. తెలుగు హీరోల్లో రామ్ చరణ్(Ram Charan) అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆయనతో నటించే అవకాశం గనుక వస్తే అస్సలు మిస్ చేసుకోనంటూ చెప్పుకొచ్చారు.