phone : ఫోన్‌ని వారానికోసారి రీస్టార్ట్ చేస్తే బెటర్ సెక్యూరిటీ!
యాపిల్ ఫోన్లను లేదా ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారికి భద్రత అనేది ఎప్పుడూ ప్రధానమైన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎస్ఎస్ఏ) కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..?
Restart The Phone : ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు అంటూ ఎవరూ కనిపించడం లేదు. దాదాపుగా అంతా దీన్ని వాడేస్తున్నారు. అందుకనే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు సైతం చాలా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో లింక్‌లు క్లిక్ చేయడం ద్వారా డబ్బులు కోల్పోవడం, తెలియని వ్యక్తులతో ఛాటింగ్‌ల ద్వారా రకరకాల నేరాల్లో ఇరుక్కోవడం లాంటివి మనం తరచుగా వింటూ ఉంటున్నాం. మన ఫోన్(Phone) భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వాటిలో మనం ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే దానిపై అమెరికా జాతీయ భద్రతా సంస్థ(NSA) కొన్ని సూచనలు చేసింది. ఆ వివరాల ప్రకారం… ఆ సంస్థ ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
సైబర్ దాడుల్లో మాల్వేర్ బారిన పడకుండా ఉండాలంటే మన ఫోన్లను కనీసం వారానికి(Week) ఒకసారైనా రీస్టార్ట్(Restart) చేయాల్సిందే. ఇలా తరచుగా ఫోన్‌ను రీస్టార్ట్ చేస్తూ ఉండటం వల్ల మన ఫోన్లను కొన్ని సైబర్ దాడుల నుంచైనా రక్షించగలుగుతాం. అలాగే తెలియకుండా మెసేజ్ బాక్స్‌లోకి చేరే ఏ అపరిచిత లింక్‌ని క్లిక్ చేయకుండా ఉండాలి. అలా చేయడం వల్ల మన ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు కావాలనుకుంటే మనం ఉపయోగించే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా మనకు కావాల్సిన దాన్ని చూసుకోవాలి. అంతేకాని తెలియని దాని నుంచి వచ్చే లింక్‌లను మాత్రం అస్సలు క్లిక్ చేయవద్దు.