»Mohan Babu Stole Jayasudhas Phone During Akkinenis Idol Unveiling Ceremony Video Viral
Mohan Babu: జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు.. వీడియో వైరల్
అక్కినేని శతజయంతి వేడుకల సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ రోజు ఏఎన్నాఆర్ విగ్రాహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహాన్ బాబు నటీ జయసుధ ఫోన్ లాక్కోవడం చర్చానీయాంశమైంది.
Mohan Babu stole Jayasudha's phone during Akkineni's idol unveiling ceremony.. Video viral
Mohan Babu: మోహన్ బాబు(Mohan babu) ఏం చేసిన వినుత్నంగా ఉంటుంది. తాజాగా బీజేపీ నేత, టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ(Jayasudha) ఫోన్ లాక్కున్న వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageshwar rao) శతజయంతి వేడుకల్లో భాగంగా స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కినేని నాగేశ్వర్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. చాలా మంది సినీప్రముఖులు, రాజకీయ, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. అందులో భాగంగా మోహాన్ బాబు, జయసుధ ఇద్దరు సభలో పక్కపక్కనే కూర్చున్నారు. ఆ సమయంలో జయసుధ తన ఫోన్ చూస్తున్నారు. విషయం గమనించిన మోహాన్ బాబు తనదైన స్టైల్లో ప్రవర్తించి ఫోన్ లాక్కొని తన ఒళ్లో దాచిపెట్టి.. శ్రద్ధగా కూర్చొలేవా.. ఎప్పుడూ ఫోన్‌నే చూస్తు ఉంటావా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టారు. దానికి జయసుధ కూడా కాస్త స్మైల్ చేస్తూ సైలెంట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.