Battery Life : ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే.. ఇవిగో టిప్స్
చాలా మంది ఫోన్ను ఎక్కువగా వాడుతుంటారు. ఫలితంగా దాని బ్యాటరీ వేగంగా డ్రయిన్ అయిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Boost Phone Battery Life : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ను(Phone) ఎక్కువగా వాడుతున్నారు. అలా పదే పదే దాన్ని వాడుతూ ఉండటం వల్ల అస్తమానూ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా బ్యాటరీ లైఫ్ సైతం పడిపోతుంది. మరి ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుని వీలైతే మన ఫోన్లోనూ ఆ సెట్టింగ్స్ చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. రండి.
ఫోన్ను(Phone) వాడలేనప్పుడు డిస్ప్లే వెంటనే ఆఫ్ అయ్యేలా సెట్టింగ్ చేసుకోవాలి. గరిష్ఠంగా ఒక నిమిషం లేదా అర నిమిషంలో ఫోన్ డిస్ప్లే ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ సేపు డిస్ప్లే ఆన్ అయి ఉండటం వల్ల ఒకటి నుంచి రెండు శాతం ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుంది. అలాగే ప్రతి ఫోన్లోనూ అడాప్టివ్ బ్యాటరీ అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని అనేబుల్ చేసుకోవాలి. అందువల్ల బ్యాటరీ లైఫ్(Battery Life ) పెరుగుతుంది.
మీ పోన్లలో ఓ ఎల్యీడీ డిస్ప్లే గనుక ఉంటే డార్క్ మోడ్ను పెట్టుకోండి. అందువల్ల బ్యాటరీ తొందరగా డ్రైన్ కాకుండా ఉంటుంది. అలాగే ఫోన్ను ఎక్కువ బ్రైట్నెస్లో పెట్టి చూడటం వల్ల కళ్లకు ఇబ్బంది, బ్యాటరీపైనా ఆ ప్రభావం పడుతుంది. అందుకనే బ్రైట్నెస్ను కాస్త డిమ్ చేసుకోండి. అవసరం లేకుండా వచ్చే కీబోర్డ్ సౌండ్లు, నోటిఫికేషన్ సౌండ్లలాంటి వాటిని తీసివేయండి. అలాగే అనవసరం అయిన నోటిఫికేషన్లను డిజేబుల్ చేయండి. దీని వల్ల బ్యాటరీ లైఫ్(Battery Life) చెప్పుకోదగ్గ రీతిలో మెరుగుపడుతుంది.