Phone Hacked Signs : సాంకేతిక అభివృద్ధి చెందే కొద్దీ వెసులుబాట్లు ఎన్ని ఉంటున్నాయో నష్టాలూ అన్ని ఉంటున్నాయి. అందుకనే మనం మన స్మార్ట్ ఫోన్ల(Smart Phones)ను ఎంత భద్రంగా ఉంచుకుందామని అనుకున్నా కొన్ని సార్లు మోసపోతూనే ఉంటున్నాం. మన ఫోన్ ఒక వేళ హ్యాక్ అయినట్లైతే అందుకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని గుర్తించగలిగితే నష్టపోకుండా ముందుగానే జాగ్రత్త పడగలగుతాం. అదెలాగంటే…
రోజూ బాగా పని చేసే ఫోన్(Phone) ఒక్కసారిగా స్లో అయినట్లు అనిపిస్తే వెంటనే మనం అప్రమత్తం కావాలి. ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉన్నా మనం బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు వేగం తగ్గినట్లు అనిపిస్తే అనుమానించారు. మీరు వాడిన దాని కంటే డేటా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు ఉన్నా జాగ్రత్త పడాలి.
హ్యాకర్ల చేతుల్లో మన ఫోన్ పడిందని తెలుసుకోవడానికి మరికొన్ని సూచనలూ ఉన్నాయి. మొబైల్ ఫోన్ పదే పదే ఆటోమేటిక్గా షట్ డౌన్ అవ్వడం మళ్లీ అదే రీ స్టార్ట్ కావడం లాంటివి జరిగుతూ ఉంటే ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవడానికి లేదు. అలాగే ఫోన్లో యాప్లు, సెట్టింగ్లు మీరు పెట్టినట్లు కాకుండా వాటికి అవే మారుతున్నా, బ్యాటరీ తొందరగా దిగిపోతున్నా కూడా అనుమానించాలి. ఫోన్ హ్యాక్ అయిన తరువాత హ్యాకర్లు చాలా మాల్వేర్, యాప్లు, డేటాను ప్రాసెస్ చేస్తారు. దీంతో మన ఫోన్ ఛార్జింగ్ తొందరగా దిగిపోతుంది. ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు వెంటనే మన ఫోన్ని ఫార్మెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేయాలి. ఇంకా ఇబ్బంద అనిపిస్తే సర్వీస్ సెంటర్లో చూపించాలి.