Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరీలోని బంద్ఝర్ ఘాట్ ప్రాంతంలో ఓ పికప్ వాహనం దాని నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. దీంతో కారు రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
#WATCH | Madhya Pradesh: 14 people died and 20 injured after a pick-up vehicle lost control and overturned at Badjhar ghat in Dindori. Injured are undergoing treatment at Shahpura Community Health Centre: Vikas Mishra, Dindori Collector
వీళ్లంతా అమ్హై డియోరి గ్రామ నివాసితులు, సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు షాపురా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్లారు. గాయపడిన వారిలో 9 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.