»Apple Does The Iphone Run Out Of Charge Quickly But Do This
Apple: ఐఫోన్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా? అయితే ఇలా చేయండి
ప్రస్తుతం యువత ఎక్కువగా ఐఫోన్ వాడుతున్నారు. వీళ్లంతా ఎక్కువగా మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అంటుంటారు. నెట్ ఆన్ చేసి వాడితే తొందరగా ఛార్జింగ్ అయిపోతుందని అంటుంటారు. మరి ఛార్జింగ్ తొందరగా అయిపోతుందని అనిపిస్తే.. బ్యాటర లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కంపెనీ కొన్ని సూచనలు చేసింది. అవేంటో మరి తెలుసుకుందాం.
Apple: Does the iPhone run out of charge quickly? But do this
Apple: బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేందుకు కంపెనీ మొదట ఐఓఎస్ అప్డేట్ చేసుకోవాలని చెబుతోంది. కొత్త ఐఓఎస్ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవచ్చు. ఎప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన వేంటనే చేయడం వల్ల డివైజ్ సామర్థ్యాన్ని పెంచుతుందని కంపెనీ తెలిపింది. ఐఫోన్లు 16- 22°C లో బాగా పనిచేస్తాయి. ఒకవేళ 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి తగిలితే బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది. అలాగే మరీ చల్లని వాతావరణంలో ఐఫోన్‌ను ఉంచిన బ్యాటరీ లైఫ్ తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అందుకే యాపిల్ ఫోన్లను సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉంచితేనే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.
మొబైల్ భద్రత కోసం కేస్లు ఉపయోగిస్తారు. కేస్‌తో పాటు ఛార్జింగ్ పెట్టడం వల్ల మొబైల్ వేడెక్కుతుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. అందుకే ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ కేస్ తీసి పెట్టడం మంచిది. అలాగే మొబైల్‌కి ఎప్పుడు కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టవద్దు. వీటితో పాటు యాపిల్ ఐఓఎస్9తో లోపవర్ మోడ్‌ను కంపెనీ పరిచయం చేసింది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ మెరుగవడమే కాకుండా డిస్ప్లే బ్రైట్నెస్, యానిమేషన్ తగ్గించడం, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను రిఫ్రెష్ చేయడాన్ని తగ్గిస్తుంది. ఐఫోన్లో బ్యాటరీ శాతం తగ్గితే లోపవర్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవాలని యాపిల్ తెలిపింది.