»One Vote That Changed History Here Are The Events
Vote: చరిత్రను మార్చిన ఒక్క ఓటు.. ఇదిగో సంఘటనలు
ఓటు హక్కు శక్తి ఏంటో చాలా మందికి తెలియదు. అందుకే నేనొక్కడిని వేయకపోతే ఏంటి అనుకుంటారు. చరిత్రలో ఒక్క ఓటు వలన జరిగిన పరిణామాలు తెలుసుకుంటే మన ఓటు విలువ ఏంటో తెలుస్తుంది. అందుకోసం కొన్ని సంఘటను మీ కోసం.
One vote that changed history.. Here are the events
Vote: పూర్వం ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు. కేవలం ధనికులు, రాజుల వద్దే ఉండేది. తరువాత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ఓటు హక్కు అందిరికీ ఉండాలని ఫైట్ చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి దాన్ని కల్పించారు. ఓటును వినియోగించి మనల్ని పాలించే నాయకుడిని ఎన్నుకొని దేశ ప్రగతిలో మనం భాగస్వామ్యం కావాలనేది దాని ఉద్దేశం. అయితే చాలా మంది నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏం అవుతుంది అని నిర్లక్ష్యం వహిస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు అని చరిత్రలో కొన్ని సంఘటనలు మనకు చెప్తున్నాయి. ఒక్క ఓటు విలువ చరిత్రను మార్చాయి అంటే దాని శక్తి ఏంటో తెలుసుకోవాలి. అందుకోసం కొన్ని చరిత్రక సంఘటనలు మీ కోసం.
భారతదేశ చరిత్రంలో తొలిసారి లోక్ సభ రద్దు అయింది ఒక్క ఓటుతోనే. 1999లో ప్రధానిగా ఉన్న అటల్ బిహార్ వాజ్‌పేయ్ తన పదవిని కోల్పోయారు. ఎన్టీయే కూటమిలో ఉన్న జయలలిత ప్రభుత్వం అన్నాడీఎంకే పార్టీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో అదే సంవత్సరం ఏప్రిల్‌లో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది. లోక్ సభ రద్దయింది.
2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒక్క ఓటు విలువ ఏంటో అర్థం అయింది. అసంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున ఏఆర్ కృష్ణమూర్తి, కాంగ్రెస్ తరఫున ధ్రువ నారాయణ పోటీలో ఉన్నారు. అయితే కృష్ణమూర్తికి 40,751 ఓట్లు వచ్చాయి. ధ్రువనారాయణకు 40,752 ఓట్లు అంటే ఒకే ఓటుతో గెలుపొందాడు. అలాగే రాజస్థాన్‌లో 2008 శాసనసభ ఎన్నికల్లో కూడా ఒకే ఓటు విజయాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సీపీ జోషి, బీజేపీ నుంచి కల్యాణ్‌సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు. చౌహాన్‌కు 62,216, జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. అయితే జోషి తల్లి, సోదరి, డ్రైవర్ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు అని వార్తలు వచ్చాయి. వారు ఓటు వేసింటే ఫలితం మరోలా ఉండే. జోషీ సిఎం అవకాశం ఉండేది. అలాగే 2018 మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇవే కాకుండా చరిత్రలో ఇంకా కొన్ని సంఘటనలు ఉన్నాయి.
1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 ఒక్క ఓటుతోనే తలతెగిపడింది.
1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజుకు సింహాసనం దక్కింది.
1776లో ఒక్క ఓటే అమెరికాలో ఇంగ్లిష్ అధికారిక భాష అయింది. లేదంటే జర్మనీ భాష అధికారికం అయ్యేది.
1850లో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడడానికి ఒక్క ఓటు ఉపయోగపడింది.
1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతోనే పదవి కోల్పోయారు.
1923లో నాజీ పార్టీకి హిట్లర్ నాయకుడిగా ఎన్నిక కావడానికి ఒకే ఓటు కారణం.