»Pm Modis Tribute To Former Prime Minister Rajiv Gandhi
PMModi: మాజీ ప్రధాని రాజీవ్‌కు పీఎం మోడీ నివాళి
భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేయగా దాన్ని బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు రీ ట్వీట్స్ చేస్తున్నారు.
PM Modi's Tribute to Former Prime Minister Rajiv Gandhi
PMModi: భారత 6వ ప్రధాన మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత, రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ప్రత్యేక నివాళులు అర్పించారు. ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈరోజు మన మాజీ ప్రధాన మంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. ఆయనకు నా నివాళి అంటూ మోడీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన ప్రత్యర్థి పార్టీ నేత అయినప్పటికీ.. ఉదారస్వాభవంతో దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళ్లు అర్పించడం అందరిని ఆకట్టుకుంది.
పూర్తి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న నెహ్రు ఫ్యామిలీనుంచి రాజీవ్ గాంధీ రాజకీయాలకు దూరంగా ఉండాలని పైలెట్‌గా పనిచేశారు. ఆ తరువాత అనుకోకుండా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత పార్టీలో ముఖ్యనాయకులుగా ఎదిగారు. తల్లి ఇందిరా గాంధీ హత్య తరువాత అతి చిన్న వయసులో 40 ఏళ్లకే రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఇక 1991లో శ్రీలంకకు చెందిన ఎల్ టీటీఈ ఆత్మహుతి చేతులో మరణించారు. తమిళ నాడులోని శ్రీ పెరంబుదూరులో జరిగిన బహిరంగ సభలో రాజీవ్ గాంధీ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.