»Meteorological Department Has Issued Yellow Alert For Many Districts
Rains : తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలర్ట్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Update : మే నెలలో రికార్డు ఉష్ణోగ్రతలతో అట్టడికిపోయిన ప్రజలకు కొన్ని రోజులుగా కాస్త స్వాంతన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడుతుండటంతో కాస్త వాతావరణం వేడి తగ్గింది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు(Rains) పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
దక్షిణ తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ప్రభావం వల్ల బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం సైతం ఏర్పడనుంది. అది 24కు వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వానలు(Rains) మరి కొన్ని రోజులు కురిసే అవకాశాలు ఉన్నాయి.
వాయుగుండం కారణంగా ఏపీలో 24న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చర్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, వనపర్తి జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు(Rains) పడతాయని తెలిపింది. ఆయా జిల్లాలలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది.