Heavy rains in Telangana: Orange alert issued by IMD
Orange alert: తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురిశాయి. సోమవారం కూడా చాలా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉదయం నుంచి తుంపర్లతో పాటు ఓ మోస్తారు వర్షం కురిసింది. అలాగే మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ సైంటిస్ట్ సోమా సేన్ వెల్లడించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడియా, దక్షిణ చత్తీస్ఘఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాబోవు నాలుగురోజులు పశ్చిమ తీరం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు, రేపు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్తా కర్నాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఉత్తరాఖండ్లో ఈరోజు, రేపు అతిభారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సైంటిస్ట్ సోమా సేన్ వెల్లడించారు.