»Muslims Used To Give Us Rice Pm Modis Interesting Comments
PM Modi: ముస్లీంలే మాకు అన్నం పెట్టేవారు.. ప్రధాని మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
తాను ఎప్పటికీ మస్లింలకు వ్యతిరేకం కాదని, కావాలని ఆయన మాటలను వక్రీకరించారని ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వూలో చెప్పారు. చిన్నప్పుడు ముస్లిం పండుగలలో పాల్గొనేదని, వారు ఇచ్చిన అన్నమే ఇంట్లో అందరూ తినేదని చెప్పుకొచ్చారు. సబ్కా సాథ్-సబ్కా వికాస్‌ను బలంగా నమ్ముతానని ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Muslims used to give us rice.. PM Modi's interesting comments
PM Modi: తాను ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. సబ్కా సాథ్-సబ్కా వికాస్‌ను బలంగా నమ్ముతానని ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆయన పేదల అభివృద్ధికోసం పాటుపడుతానని, దాని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ముస్లిం సమాజం గురించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన విధానం చూసి ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. ఎక్కువ మంది పిల్లలు అంటే కేవలం ముస్లింలే కాదు, నిరుపేదలు కూడా చాలా మంది పిల్లలను కంటారు. వాళ్లను పెంచడానికి ఇబ్బందులు పడుతారు. అది ఏ వర్గం అయినా సరే వారు చూసుకోగలిగినంత సంతానాన్నే కనాలి కానీ, ప్రభుత్వంపై భారం పడెంత కాదు అనే సందర్భంలో చెప్పినట్లు ఆయన స్పష్టత ఇచ్చారు.
గోద్రా రైలు దహనకాండ జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఆ సమయంలో ముస్లింలను టార్గెట్‌గా చేసుకొని దాడులు చేశారు అనే ఆరోపణలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చిన్నప్పుడు వారి ఇంటి చుట్టుపక్కల చాలా ముస్లిం కుటుంబాలు ఉండేవన్నారు. అన్ని ముస్లిం పండుగలు వారితో పాటే వీరు జరుపుకునేవారని పేర్కొన్నారు. ఈద్ పండుగ రోజు ఇంట్లో వంట కూడా చేసుకునే వారు కాదని, ఆ సమయంలో ముస్లింలే వంట చేసి పంపేవారని, అలా వారి మొహర్రంలోనూ భాగమయ్యేవాళ్లమన్నారు. అంతా కలిసిమెలిసి ఉండేవాళ్లమని అలాంటి వాతావరణం నుంచి తాను పెరిగినట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో హిందూ, ముస్లిం అని కాదు ఈ దేశ పౌరుడు బీజేపీకి ఓటు వేస్తారు అని చెప్పారు.