Lift Collapse in copper mine : ఓ కాపర్ గనిలో ఉన్నట్లుండి లిఫ్టు రోప్ తెగిపోవడంతో అది కూలిపోయింది. దీంతో గనిలో మొత్తం 14 మంది చిక్కుకుపోయారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని(Rajasthan) జుంజును జిల్లాలో ఉన్న హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL) మైన్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీనిలో చిక్కుకున్న వారిలో సీనియర్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా ఉన్నారు.
దీంతో అక్కడ వెంటనే సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది కార్మికులను గని నుంచి సురక్షితంగా బయటకు తీశారు. మరో ఆరుగురు ఇంకా గనిలోనే చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. బయటకు తీసిన వారిని దగ్గరలోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. వారికి తగిలిన గాయాలకు అక్కడ చికిత్స అందిస్తున్నారు.
ఈ మైన్‌ని పరిశీలించేందుకు కోల్‌కతా నుంచి ఓ విజిలెన్స్ బృందం కూడా వచ్చింది. వారిని తీసుకెళ్లే సమయంలోనే లిఫ్టు హఠాత్తుగా కూలిపోయింది. ఉన్నట్లుంది. అది 577 మీటర్లు గని లోపలికి పడిపోయింది. దీంతో ఎగ్జిట్ గేట్ నుంచి ముందుగా వైద్య బృందాన్ని గని లోపలికి పంపించారు. వారికి అవసరమైన అత్యవసర వైద్య చికిత్సలు చేసే నిమిత్తమై వారు ప్రయత్నాలు చేశారు. ఈ విషయమై రాజస్థాన్ ముఖ్యమంత్రి(Rajasthan Chief Minister ) భజన్‌లాల్ శర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని కోరారు.