త్వరలోనే 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ.. ఇప్పుడు మీ ఓటు నాకే వేయాలి అంటూ.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Nani: చివరగా ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి నాని.. త్వరలోనే హాయ్ నాన్న అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబర్ 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో శౌర్యువ్ అనే మరో కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా నటించగా, మృణాల్ ఠాకూర్ అతని భార్యగా నటించింది.
ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో పొలిటికల్ యాంగిల్లో ప్రమోషన్ టచ్ ఇస్తున్నాడు నాని. మూవీ నుంచి రాజకీయ నాయకుడి గెటప్‌లో ఉన్న నాని పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇది ఎన్నికల సీజన్.. ఇందులో మనం కూడా ఎందుకు జాయిన్ కాకూడదు.. డిసెంబర్ 7న మీ ప్రేమను మరియు మీ ఓటు మాకే వేయాలి. ఇట్లు.. మీ ‘హాయ్ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్ విరాజ్’ అని రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి ప్రమోషన్స్ సినిమాకు కలిసొచ్చే అంశమేనని చెప్పాలి. ఎందుకంటే.. ఎన్నికల వేళ సినిమాలను పట్టించుకునే మూడ్‌లో లేరు జనాలు. అందుకే.. మేకర్స్ ఇలా సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు.