»Nanis Garam Garam Lyrical Video Release From Saripoda Shanivaram
Saripoda Shanivaram: నాని సరిపోదా శనివారం నుంచి గరం గరం సాంగ్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా గరం గరం అనే లిరికల్ సాంగ్ విడుదలైంది.
Saripoda Shanivaram: నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ మూవీ నుంచి తాజాగా గరమ్ గరమ్ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయింది. గండర గండర అంటూ సాగే ఈ పాట ఇంట్రెస్టింగ్గా ఉంది. క్లాస్‌కు మాస్కు మధ్యలో ఉంటాడు అనే పదాలు నానికి సరిపోయేలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్ జే సూర్య, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ బాణీలకు భరద్వాజ్ పాత్రుడు పాట రాశారు. ఈ హీరో ఎలివేషన్ సాంగ్‌ను విశాల్ దడ్లానీ ఆలపించారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై విలక్షణమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలకు సిద్ధం అయింది.