»Last Phase Of Lok Sabha Elections Polling Begins In 57 Constituencies
Elections : కొనసాగుతున్న చివరి దశ ఎన్నికల పోలింగ్
భారత దేశ వ్యాప్తంగా చివరి దశ సార్వత్రిక ఎన్నికలు ఈ ఉదయం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
Lok Sabha Elections : అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు ఏడు రాష్ట్రాల్లో శనివారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం 57 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఈ చివరి దశలో ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాల్లో, పంజాబ్‌లో 13, హిమాచల్ ప్రదేశ్‌లో 4, బీహార్‌లో 8, బెంగాల్లో 9, జార్ఖండ్‌లో 3, ఒడిశాలో 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు 42 అసెంబ్లీ స్థానాలకూ పోలింగ్ జరుగుతోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలతో పాటు, మిగిలిన ఆరు దశల్లో జరిగిన ఎన్నికలకు(elections) సైతం ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
ఏడో దశ ఎన్నికల్లో(elections) పోటీ పడుతున్న ప్రముఖుల్లో వారణాసి నుంచి ప్రధాన మంత్రి(Pm) నరేంద్ర మోదీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌నుంచి అజయ్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు, హిమాచల్ ప్రదేశ్ నుంచి నటి కంగానా రనౌత్, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ లాంటి వారు బరిలో ఉన్నారు. ఈ ఏడో దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా పంజాబ్ నుంచి 328 మంది పోటీ పడుతున్నారు.