LPG : తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు.. మన దగ్గర ఎంతంటే?
ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ కవర్షియల్ వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంకీ ఎంత తగ్గించాయి? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సిలిండర్ ధర ఎంత ఉంది? తెలుసుకుందాం రండి.
LPG Price Cut : దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశలో ఉన్న వేళ చమురు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్(COMMERCIAL LPG CYLINDER) ధరను రూ.72 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. ఇదిలా ఉండగా డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి తేడా ఉండదని పేర్కొన్నాయి. దీంతో గతంతో పోలిస్తే పలు రాష్ట్రాల్లో వీటి ధరల్లో తేడాలు నమోదయ్యాయి.
హైదరాబాద్లో పందొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్(COMMERCIAL GAS) సిలెండర్ ధర గతంలో రూ.1975.50గా ఉండేది. ఇప్పుడు తగ్గిన ధరల వల్ల రూ.1903గా ఉంది. అలాగే చెన్నైలో రూ.1911గా ఉన్న దీని ధర ఇప్పుడు రూ.1840కి చేరుకుంది. కోల్కతాలో రూ.1859గా ఉన్న పాత సిలిండర్ ధర రూ.1787కు చేరుకుంది. ఇంకా ముంబయిలో రూ.1698.50గా ఉన్న దీని ధర ఇప్పుడు రూ.1629గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో అయితే గతంలో దీని ధర రూ.1745.50గా ఉండేది. ఇప్పుడు తగ్గించిన ధరలతో రూ.1676కు చేరుకుంది.
కవర్షియల్ గ్యాస్ సిలిండర్(COMMERCIAL GAS CYLINDER) ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా రెండు నెలలుగా తగ్గించాయి. ఏప్రిల్, మేనెలల మొదట్లోనూ తగ్గింపుని ఇచ్చాయి. తాజాగా జూన్లో కూడా ఈ ధరలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రాలు వేసే వడ్డనతో మనకు సిలిండర్ రేటు ఎంత అనేది తెలియకుండా పోతోంది. దీని అసలు ధర తెలుసుకోవాలటే ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.