»Mamata Banerjee Cooking Gas May Increase If Bjp Comes To Power
Mamata Banerjee: బీజేపీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ పెరగొచ్చు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోతాయన్నారు.
Mamata Banerjee: కేందంలో ఇప్పటికి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి కూడా విజయం సాధించాలని ఆశగా ఉంది ఈసారి ఎలాగైన అధికారం చేపట్టాలనుకుంటుంది. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోతాయన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ ధర రూ.2 వేల వరకు పెరిగిన షాక్ కావాల్సిన అవసరం లేదని మమతా తెలిపారు.
ఇదే జరిగితే మంటలు వెలిగించికోవడానికి కలపను సేకరించే పాత పద్ధతికే తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఆవాస్ యోజన కింద చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ ఓ అల్టిమేటం జారీ చేశారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఇలా చేయకపోతే మే నెలలో తమ రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని హెచ్చరించారు.