వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దన్నారు.
YS Sunitha: వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని.. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు. సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది నాలుగు నుంచి ఐదు రోజుల్లో తెలిసిపోతుంది. కానీ వివేకానందరెడ్డి కేసులో ఐదేళ్లయినా ఇంకా ఎందుకు తెలియడం లేదని ఆమె పశ్నించారు.
సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే తిరుగుతుంటారు. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే సందేశం ఏంటి? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదని సునీత అన్నారు. మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైసీపీకు ఓటు వేయొద్దని సునీత కోరారు. అవినాష్, భాస్కర్‌రెడ్డిని వైసీపీ ప్రభుత్వం ఇంకా రక్షిస్తూనే ఉంది. మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే ఇంకా కష్టాలే తప్ప ఏం ఉండవు. జగన్ పాత్రపై విచారణ చేయాలి.. అతను నిర్దోషి అయితే వదిలేయాలని సునీత తెలిపారు.