»Revanth Reddy Harish Rao Won The Bjp By A Close Margin
Revanth Reddy: హరీష్ రావు బీజేపీని దగ్గరుండి గెలిపించారు.
లోక్ సభ ఫలితాలు వెలువడిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ సాయం చేసిందని ఆరోపించారు.
Revanth Reddy: Harish Rao won the BJP by a close margin.
Revanth Reddy: లోక్ సభ ఫలితాలు వెలువడిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ సాయం చేసిందని ఆరోపించారు. అందులో భాగంగా మెదక్ బీజేపీ అభ్యర్థి గెలిపించేందుకు హరీశ్ రావు సహకారం చేశారుని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే పార్లమెంట్ వచ్చిన ఓట్ల శాతం పెరిగిందని చెప్పారు. అందుకే 8 సీట్లు కాంగ్రెస్ గెలిచిందని ఇది ప్రజల ఆశ్వీరదమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పాలనను చూసిన తరువాత 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో 3 సీట్లే గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2024లో 8 సీట్లు గెలుచుకుంది.. ఇది కాదా కాంగ్రెస్ విజయం అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఏడు సీట్లలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదని దాదాపు 14 స్థానాల్లో మూడో ప్లేస్లో ఉందని చెప్పారు. 7 సీట్లను బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అవయవదానం చేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కావాలనే బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరించిందని ఆరోపించారు. తెలంగాణలో అమలు చేసిన 6 గ్యారంటీలు, 100 రోజుల పాలన చూసిన తరువాత ప్రజలకు తీర్పు ఇచ్చారు అని అందుకే 8 సీట్లు గెలిచామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.