YCP leaders: కూటమిని తట్టుకుని నిలబడ్డ వైసీపీ నాయకులు
ఏపీలో కూటమి ప్రభంజనానికి వైసీపీ కుదేలయింది. ఘోర పరాజయం చవిచూసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని ఫలితాలు విశ్లేషకులను సైతం విస్మయపరిచాయి. ఇంతటి కూటమి హవాలోనూ వైసీపీ తరపున సీఎం జగన్తో పాటు మరో పది మంది గెలుపును సొంతం చేసుకున్నారు.
YCP leaders: ఏపీలో కూటమి ప్రభంజనానికి వైసీపీ కుదేలయింది. ఘోర పరాజయం చవిచూసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని ఫలితాలు విశ్లేషకులను సైతం విస్మయపరిచాయి. ఇంతటి కూటమి హవాలోనూ వైసీపీ తరపున సీఎం జగన్తో పాటు మరో పది మంది గెలుపును సొంతం చేసుకున్నారు. ఎదురుగాలిని తట్టుకుని నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. టీడీపీ కూటమి చరిత్ర సృష్టించింది. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. 135 స్థానాల్లో విజయంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించగా, రెండో స్థానంలో ఉన్న జనసేన 21 స్థానాల్లో విజయం సాధించింది. అధికార వైకాపా కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో రాష్ట్రంలో మూడవ స్థానానికి దిగజారింది.
అరకు అభ్యర్ధి రేగం మత్యలింగం, పాడేరు అభ్యర్ధి మత్స్యరాస విశ్వేశ్వర రాజు, యర్రగొండపాలెం అభ్యర్ధి చంద్ర శేఖర్ తాటిపర్తి, దర్శి అభ్యర్ధి.. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, బద్వేల్ అభ్యర్ధి దాసరి సుధ, రాజంపేట అభ్యర్ధి..ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,, పులివెందుల అభ్యర్ధి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపొందారు. వీరితో పాటు మంత్రాలయం అభ్యర్ధి.. వై. బాలనాగి రెడ్డి, ఆలూరు అభ్యర్ధి.. బి. విరూపాక్షి, తంబళ్లపల్లె అభ్యర్ధి.. పి. ద్వారకనాథ రెడ్డి, పుంగనూరు అభ్యర్ధి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కూటమి హవాను తట్టుకుని గెలవగలిగారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 160కి పైగా స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఏకంగా 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 21 స్థానాలకు 21 స్థానాలను కూడా కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. బీజేపీ కూడా తన ఉనికి చాటుకుని 8 స్థానాల్లో పాగా వేసింది.