»Chandrababu Who Declared His Support For Modi Alliance Attends Nda Meeting
Chandrababu: కేంద్రానికి కూటమి అవసరం.. బాబు నిర్ణయం ఇదే.
ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో తిరుగులేని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కూటమి అవసరం ఉంది. ఇప్పటికే మోడీ చంద్రబాబుతో టచ్లో ఉన్నారు. రాహుల్ గాంధీసైతం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన స్టేట్మెంట్ ఇచ్చారు.
Chandrababu who declared his support for Modi.. Alliance attends NDA meeting
Chandrababu: దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు తేటతెల్లం అయ్యాయి. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చాయి. సరైన వ్యూహంతో వెళ్లిన కూటమికి భారీ విజయం దక్కింది. ఇక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సైతం వేగంగా పావులు కదుపుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి లోక్ సభ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు అందులో 3 బీజేపీ గెలిచింది. ఇక మిగిలిన 18 సీట్లు ఎన్డీయే అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యనాయకులు చంద్రబాబుతో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. మొదటి నుంచి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటామన్నారు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలోనే తాము భాగస్వామ్యులుగా ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు. కూటమి భేటీకి సైతం హాజరవుతున్నామన్నారు. దీనిలో వేరే ఆలోచనకు తావులేదని చెప్పారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే నినాదంతోనే పని చేసినట్లు చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయంలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ దెబ్బతీశారు. జై జగన్ అనకుంటే కేసులు పెట్టారు. టీడీపీ కార్యకర్తలకు ప్రశాంతత లేకుండా చేశారు అని పేర్కొన్నారు.
కూటమి ధ్యేయం ఒక్కటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని చెప్పారు. మొత్తం కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం టీడీపీకే 45.60 శాతం రాగా వైఎస్సార్సీపీకి 39.37 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇది చరిత్రాత్మకమైన ఫలితాలు అని పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు అని తెలిపారు. ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లు వచ్చాయని మళ్లీ అంతటి ఘననీయమైన నెంబర్ ఈ ఎన్నికల్లో కనిపించిందని పేర్కొన్నారు.