AP CID : సెలవులపై విదేశాలకు సీఐడీ చీఫ్, పారిపోతున్నారంటూ భారీగా ట్రోల్స్
జగన్మోహన్ రెడ్డి చేతుల్లో కీలు బొమ్మగా మారి ఇష్టానుసారంగా సీఐడీ కేసులు పెట్టుకుంటూ వెళ్లిన సీఐడీ చీఫ్ సంజయ్ నెల రోజుల పాటు సెలవులపై విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ప్రవర్తన చూసి విసిగిపోయిన చాలా మంది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు.
AP CID : ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్(AP CID CHIEF SANJAY) ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నెల రోజులు సెలవులు పెట్టేశారు. వ్యక్తిగత కారణాల దృష్య్టా తాను విదేశాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ ఆయన కనుసన్నల్లో పని చేశారు. ఇష్టారీతిన తప్పుడు కేసులు పెడుతూ జగన్ కార్యక్రమాలకు అండగా నిలిచారు.
మంగళవారం వెల్లడైన ఏపీ(AP) ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ భారీగా సీట్లను కోల్పోయి ప్రతిపక్షంగా నిలిచేందుకు సైతం అర్హత సంపాదించలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఐడీ చీఫ్(AP CID CHIEF) నెల రోజులు సెలవు పెట్టి విదేశాలకు చెక్కేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రేమో మాపో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో ఆయన ఈ విధంగా సెలవులు(LEAVES) పెట్టడంపై నెట్టింట భారీగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
సంజయ్‌పై గుర్రుగా ఉన్న కూటమి కార్యకర్తలు సైతం ఇప్పుడు ఆయన సెలవులపై ట్రోల్స్ చేస్తున్నారు. భయపడే ఆయన సెలవులపై వెళుతున్నారని మీమ్స్ చేస్తున్నారు. లోకేశ్ రెడ్ బుక్‌లలో సంజయ్ పేరుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అలాగే సంజయ్‌కు అస్సామే.. అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశారు. సంజయ్ ఒక్కరిని అరెస్టు చేసి విచారిస్తే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, కుంభకోణాలు అన్నీ వెలుగులోకి వస్తాయంటూ మరికొందరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.