»What Are 80 Thousand Cops Doing Court Pulls Up Punjab Government
80 thousand cops ఏం చేస్తున్నారు.. అమృత్ పాల్ సింగ్ తప్పించుకోవడంపై కోర్టు ఆగ్రహాం
80 thousand cops:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.
what are 80 thousand cops doing! court pulls up punjab government
80 thousand cops:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.
పాకిస్థాన్ ఐఎస్ఐ (isi), ఉగ్రవాద సంస్థలతో అమృత్ పాల్‌కు (Amritpal Singh) సంబంధాలు ఉన్నాయని భారత్ నిఘా విభాగం (ib) హెచ్చరించింది. దీంతో శనివారం అతడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 50 వాహనాలతో (50 vehicles) వెంబడించి.. షాకొట్ వద్ద అతని పట్టుకున్నంత పనిచేశారు. అతడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందని ఇంటర్నెట్ (internet) బంద్ చేశారు. అమృత్ పాల్ (Amritpal Singh) కోసం ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు 120 మందిని (120 people) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పష్టంచేశారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులను విడిచిపెట్టబోం.. ప్రజలు శాంతి, అభివృద్ది మాత్రమే కోరుకుంటున్నారని స్పష్టంచేశారు.
ఇటీవల అజ్నాలాలో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరుడు లవర్ ప్రీత్ సింగ్ తుపాన్, (lover preeth singh) పంజాబ్ పోలీసులు (punjab police) మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అతని మద్దతు దారులు కత్తులు, తుపాకులు తీసుకొని పోలీసు బారికేడ్లను చేదించి మరీ అజ్నాలా (ajnala) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. గొడవ నేపథ్యంలో లవర్ ప్రీత్ తుఫాన్‌ను (lover preeth singh) పోలీసులు అరెస్ట్ చేశారు. అనుచరులు రెచ్చిపోవడంతో వదిలిపెట్టారు.