MBNR: నెలబండ తండా జీపీ పరిధిలోని మూడు తండాలకు బీటీ రోడ్డు లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలుమార్లు విన్నవించినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో స్కూల్ బస్సుల రాకపోకలు దెబ్బతింటున్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.