పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తోన్న మూవీ ‘స్పిరిట్’. తాజాగా ఈ మూవీ షూటింగ్‌పై కీలక అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. గోవాలో వివేక్ ఒబెరాయ్, మరికొందరితో షూటింగ్ జరుగుతోందట. ఈ షెడ్యూల్లో ప్రభాస్ త్వరలోనే చేరనున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.