‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు ‘రాకాస’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఫాంటసీ+కామెడీ జోనర్లో సాగే ఈ మూవీతో ప్రేక్షకులకు మంచి వినోదం పంచాలన్నదే లక్ష్యమని నిహారిక పేర్కొంది.