NLR: ఇందుకూరుపేట మండలంలోని డేవిస్పేట యాగర్ల బ్రిడ్జి వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకున్నది. మైపాడు నుంచి నెల్లూరు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులకి ఎటువంటి గాయాలు కాలేదు. చుట్టుప్రక్కల ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.