తన రెండో పెళ్లిపై వస్తున్న ప్రశ్నలకు నిహారిక కొణిదెల సమాధానం ఇచ్చింది. భవిష్యత్తులో తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని తెలిపింది. ఈ క్రమంలో SM ట్రోల్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించింది. అసభ్యకరంగా ప్రవర్తించే వారికి శిక్ష పడితేనే ఇతరులకు భయం వస్తుందని, అది లేకపోవడం వల్లే కొందరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది.