TG: సిద్దిపేటలోని నర్మెట్టలో నిన్న సీఎం రేవంత్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అయితే నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తొలి విడతలో భాగంగా రూ.3,590 కోట్లు విడుదల అయ్యాయి. కాగా ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది.