MLG: ములుగు మండలం ఇంచర్ల గట్టమ్మ వద్ద రామప్ప ప్రాంత సుస్థిర పర్యాటక సర్క్యూట్లో భాగంగా నిర్మిస్తున్న టూరిజం విలేజ్ పనులను ఆదివారం సాయంత్రం మంత్రి దనసరి సీతక్క పరిశీలించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ దివాకర్ టిఎస్, DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.