అన్నమయ్య: గాలివీడుకు చెందిన వైసీపీ నాయకుడు సిద్దారెడ్డి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శనరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సిద్దారెడ్డి మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.