ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు కేసులో NIA సోదాలను ముమ్మరం చేసింది. జమ్మూకాశ్మీర్లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కుపారా జిల్లా గులూరాలో ఓ వ్యాపారి నివాసంలో సోదాలు చేపట్టింది. కాగా ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే.