రణవీర్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే రూ.750 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసినట్లు తెలుస్తోంది. దీంతో ‘బాహుబలి 2′(రూ.591CR), ‘RRR'(రూ.470CR), ‘కల్కి'(రూ.500CR) వంటి భారీ సినిమాల రికార్డులను అధిగమించి, భారతీయ సినీచరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో మూవీగా నిలిచింది.