ATP: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో శిల్పారామంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫుడ్ కోర్టులు, చేతివృత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గుత్తి కోటలో నడక మెట్ల నిర్మాణం, కుందుర్పి కోట అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.