ELR: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఉంగుటూరు మండలం చేబ్రోలు గీతాంజలి పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. మేళాలో 10కి పైగా కంపెనీలు పాల్గొని 860 ఉద్యోగాలు అందించనున్నాయి.