TG: మూసీ పరివాహక ప్రాంత వాసులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘ఎవరినీ నిరాశ్రయులను చేయడం లేదు. బాధితులకు పునరావాసం కల్పిస్తాం. విద్య, వైద్యం అందిస్తాం. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకారం అందిస్తాం. ఏ ఒక్కరికీ నష్టం కలిగించం. మెరుగైన వసతులు కల్పించాకే తరలిస్తాం. విపక్షాల ట్రాప్లో పడొద్దు’ అని ఆయన సూచించారు.