TG: కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘సిటీలో ఉన్న పరిశ్రమలను తరలిస్తే.. ఆ భూములను మల్టీ జోన్లుగా వినియోగించుకోవచ్చు. పంజాగుట్ట, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌ల్లో ఎలివేటెడ్ కారిడార్లు.. సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆగకుండా వెళ్లాలనేదే మా ఆలోచన. చిరు వ్యాపారులకు ఇబ్బంది ఉన్నా ఆక్రమణలు తొలగిస్తాం’ అని పేర్కొన్నారు.