TG: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్టులు చేస్తారా? మరి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ని ఏం చేయాలి?’ అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.