TG: ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలంటూ BJP కార్యకర్తల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్న క్రమంలో.. వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తమ నేతను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తే కమలదళం బైఠాయించింది.