TG: ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కేసు విచారణకు ఫైనాన్స్ సెక్రటరీ హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టింది. అసెంబ్లీ సమావేశాలున్నందునే హాజరుకాలేకపోయానని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ‘ఈ రోజు అర్థరాత్రి వరకు కోర్టు హాల్లోనే ఉంటాం. విచారణకు హాజరుకావాల్సిందే. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లేదు’ అని కోర్టు పేర్కొంది.