భద్రాచలం శ్రీరామ కళ్యాణం సందర్భంగా కాలినడకన వచ్చే భక్తుల కోసం ముకమామిడి గ్రామంలో సదుపాయాలు కల్పించారు. ప్రధాన రోడ్డుపై మంచినీటి ఏర్పాటు చేసి భక్తులకు ఉపశమనం కలిగించారు. అలాగే బస్టాండ్ ఆవరణాన్ని శుభ్రపరిచి విశ్రాంతికి అనుకూలంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.