KDP: దేహం కంటే దేశం గొప్పదని నమ్మి దేశమాత కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావులు భగత్ సింగ్ అని మాజీ ఎంపీ తులసి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వేంపల్లెలో భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లు స్వాతంత్య్ర సమరయోధులు, దేశభక్తులు, విప్లవ వీరులు అని కొనియాడారు.