JGL: పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో మండల ఇంఛార్జ్ డా. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పశువులకు ఉచిత గాలికుంటు టీకాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ వనజ, ఏఎంసీ ఛైర్మన్ రాములు గౌడ్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, గోపాలమిత్ర జిల్లా సూపర్వైజర్ నరసయ్య, పశు వైద్య సిబ్బంది వీఏ మతిన్, వోఎస్ వినీత్ పాల్గొన్నారు.