MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ పరిధిలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.