AP: అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల పేరిట CM చంద్రబాబు, ఆయన బినామీలు కోట్లు కొట్టేస్తున్నారని YCP ఆరోపించింది. కేవలం డిజైన్లు గీసి ఇవ్వడానికే రూ.401 కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించింది. ఇష్టానుసారం ధరలు పెంచేసి తమకు నచ్చినవారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ ముడుపులు తీసుకుంటున్న ఆరోపణలు గుప్పుమంటున్నాయంది.